: విజయవాడలో చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ


ఈ ఉదయం విజయవాడకు వెళ్లిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబునాయుడితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎంతో భేటీ అయ్యేందుకు ఎల్ రమణ, మోత్కుపల్లి, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు విజయవాడకు రాగా, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి చంద్రబాబు వారితో చర్చిస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో, పార్టీ బలోపేతం తదితర అంశాలపై వీరి మధ్య చర్చలు సాగుతున్నట్టు సమాచారం. పార్టీని వీడుతున్న వారిని ఎందుకు అడ్డుకోలేకపోయారని చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News