: వైకాపాలో చేరిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి, స్వాగతం పలికిన జగన్


టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలే కాదు, ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా, వైఎస్ జగన్ నాయకత్వంలో నడుస్తున్న వైకాపా సైతం ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. కొద్ది సేపటి క్రితం ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైకాపాలో చేరారు. జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువాను కప్పుకున్నారు. ఎంపీ మేకపాటి తదితరులతో వచ్చిన ఆనంకు జగన్ స్వాగతం పలికారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆనం విజయ్ కుమార్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. జిల్లాలో రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న ఆనం సోదరులు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరితే, వారికి దగ్గరి బంధువైన విజయ్ కుమార్ వైకాపాలో చేరడంతో నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారుతాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News