: మీరు అద్దెలు పెంచితే, నాకు బాధగా ఉంటుంది: అమరావతి వాసులతో చంద్రబాబు
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న వందలాది మంది ఏపీ ఉద్యోగులు మూడు, నాలుగు నెలల తరువాత అమరావతి పరిధిలోని గ్రామాలకు, విజయవాడ, గుంటూరు నగరాలకు తరలిరానున్నారని, ఆ సమయంలో ఇంటి అద్దెలు భారీగా పెంచవద్దని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. డబ్బుపై ఆశతో ఇంటద్దెలు పెంచితే, మొత్తం పరిపాలనా వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇంటద్దెలు పెంచడం తనకు బాధాకరమని, ఈ విషయంలో ప్రజలు అర్థం చేసుకుంటారనే ఆశిస్తున్నానని అన్నారు. జూన్ తరువాత పరిపాలన వెలగపూడి నుంచే సాగుతుందని స్పష్టం చేసిన ఆయన, ఇక్కడికి వచ్చే ఉద్యోగులతో సామరస్యంగా వ్యవహరించాలని స్థానిక ప్రజలను కోరారు.