: ప్రజలకు ఖేదం... చిన్న మొత్తాల పొదుపు, కిసాన్ వికాస పత్రాలపై తగ్గిన వడ్డీ!


ఓ వైపు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలపై స్వల్పంగా వడ్డీ రేట్లు పెరిగిన వేళ, పేదలు, మధ్యతరగతి వర్గాలు దాచుకునే చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. పోస్టాఫీసుల్లో స్వల్పకాల సేవింగ్స్ ఖాతాలపై ఈ మార్పు వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 1, 2, 3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లు, కిసాన్ వికాస పత్రాలు, ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై వడ్డీలు తగ్గుతాయని తెలిపింది. ఇదే సమయంలో నెలవారీ సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్)లు, పీపీఎఫ్, సీనియర్ సిటిజన్, బాలికల ఖాతాలపై వడ్డీని తగ్గించబోవడం లేదని వెల్లడించింది. ప్రస్తుతం స్వల్పకాల డిపాజిట్లపై 8.4 శాతం వడ్డీ లభిస్తుండగా, ఇకపై అది 8.15 శాతానికి తగ్గనుంది. ఇకపై ప్రతి మూడు నెలలకూ పరపతి విధానం, ద్రవ్యోల్బణం తదితరాలను ప్రాతిపదికగా తీసుకుని చిన్న మొత్తాలపై వడ్డీలను సవరిస్తామని ఆర్థిక శాఖ వెల్లడించింది.

  • Loading...

More Telugu News