: తిరుపతిలో భారీ పేలుడు... టపాకాయల పేలుడు కావచ్చంటున్న స్థానికులు!
పుణ్యక్షేత్రం తిరుపతిలో ఈ ఉదయం భారీ పేలుడు వినిపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నిత్యమూ బిజీగా ఉండే అన్నారావు కూడలి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడి ఎస్ఆర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద మురికి కాల్వలో పేలుడు సంభవించగా, ఎవరికీ గాయాలైనట్టు సమాచారం లేదు. స్థానికులు ఎమర్జెన్సీ నెంబర్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఈ పేలుడుకు కారణాలేంటన్న దానిపై విచారణ ప్రారంభించారు. ఏదైనా టపాకాయల బాక్సుకు ఒక్కసారిగా నిప్పంటుకుని పేలి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.