: ఆరు బంగారు నాణాలు... వాటిపై భాష గుర్తిస్తే నజరానా!


దాదాపు 55 సంవత్సరాల క్రితం చైనాలో జరిపిన తవ్వకాల్లో ఓ మట్టి కుండ దొరకగా, అందులో ఆరు నాణాలు ఉన్నాయి. వాటి వెనుక కొన్ని అక్షరాలున్నాయి. అవి ఏంటి? ఏ భాషకు చెందిన అక్షరాలు, వాటిల్లో ఏముంది? అన్నది ఇంతవరకూ తేల్చలేకపోయారు. హునాన్ ప్రావిన్స్ లోని మ్యూజియంలో వీటిని భద్రపరిచారు. ఎందరో నిపుణులు వీటిని పరిశీలించినప్పటికీ, ఆ అక్షరాలు ఏంటన్నది కనుక్కోలేకపోయారు. దీని గుట్టు విప్పేందుకు కల్చరల్ రెలిక్స్ బ్యూరో డైరెక్టర్ పెంగ్ జియా, ఎందరో నిపుణులను కలిసినా ఫలితాన్ని మాత్రం పొందలేకపోయారు. ఇక ఆ లిపిని గుర్తిస్తే, 10 వేల యువాన్లు బహుమతిగా ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇవి చైనా దేశ తొలి దశ సంస్కృతికి చెందిన అక్షరాలు అయి ఉండవచ్చని ఓ అంచనా. గ్రీక్ పద్ధతిని అనుసరిస్తూ, బహమనీ సుల్తానుల కాలంలో వీటిని తయారు చేసి వుంటారని కూడా పలువురు ఓ అంచనాకు వచ్చారే తప్ప వాటిపై ఏముందన్నది మాత్రం కనుక్కోలేదు.

  • Loading...

More Telugu News