: డొనాల్డ్ ట్రంప్ గెలవడంటే గెలవడు: ఒబామా
రిపబ్లికన్ల తరఫున పోటీపడి అమెరికా అధ్యక్షుడిగా గెలవాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కల నెరవేరబోదని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా జోస్యం చెప్పారు. ట్రంప్ అడ్డగోలుగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించిన ఆయన, యూఎస్ ప్రజానీకం ఆయన్ను తిరస్కరిస్తారనే భావిస్తున్నట్టు తెలిపారు. కాలిఫోర్నియాలో మీడియాతో మాట్లాడిన ఆయన, అధ్యక్ష పదవి ఎంత ఉన్నతమైనదో అమెరికన్లకు తెలుసునని, ఈ పదవి రియాల్టీ షో లేదా టాక్ షో కాదని, ఎంతో క్లిష్టమైన పనని అన్నారు. మీడియాలో ప్రముఖంగా కనిపించేందుకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం అధ్యక్ష పదవి కాదని హితవు పలికారు. కేవలం మీడియా కోసమే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన గెలిచే అవకాశాలు లేవని, అధ్యక్షుడిగా ఎన్నిక కాబోరని ఒబామా అన్నారు.