: ఇక జాదవ్ పూర్ వర్సిటీ వంతు!... హోరెత్తిన అఫ్జల్ గురు అనుకూల నినాదాలు


భారత పార్లమెంటుపై దాడికి దిగిన అఫ్జల్ గురు ఉరి శిక్షకు గురయ్యాడు. ఇది జరిగి చాలా కాలమే అవుతోంది. అయితే ఇటీవల ఈ అఫ్జల్ ఉరికి నిరసనగా విద్యార్థుల ర్యాలీతో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నిప్పుల కుంపటిలా మారింది. వర్సిటీలోకి పోలీసుల ఎంట్రీ, విద్యార్థుల నిరసనలు, రాజకీయ నేతల పరామర్శలు... తదితరాలతో వర్సిటీ ఉద్రిక్త పరిస్థితులకు నెలవైంది. అక్కడ ఇంకా పరిస్థితులు చల్లబడనే లేదు, అప్పుడే కోల్ కతాలోని జాదవ్ పూర్ వర్సిటీలోనూ ఇదే తరహా వివాదం చోటుచేసుకుంది. నిన్న రాత్రి వర్సిటీలోని రోడ్లపైకి వచ్చిన విద్యార్థులు అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలతో హోరెత్తించారు. ‘‘అఫ్జల్ గురుతో పాటు ఎస్ఏఆర్ గిలానీలు స్వేచ్ఛ కోసం గొంతెత్తారు. స్వేచ్ఛను స్వచ్ఛందంగా ఇవ్వకపోతే లాక్కోవాల్సి వస్తుంది’’ అంటూ పెద్ద పెట్టున విద్యార్థులు నినాదాలు చేయడంతో ఒక్కసారిగా కోల్ కతాలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News