: వేదమంత్రోచ్చారణ మధ్య తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం శంకుస్థాపన చేశారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో ఎంపిక చేసిన స్థలంలో ముందుగానే నిర్ణయించిన సుముహూర్తం ప్రకారం సరిగ్గా 8.23 గంటలకు చంద్రబాబు పునాది రాయి వేశారు. దానిపై సిమెంట్ వేసి శంకుస్థాపనను పూర్తి చేశారు. వేదమంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News