: అమరావతి ప్రస్థానంలో కీలక ఘట్టం... తాత్కాలిక సచివాలయానికి మరికాసేపట్లో శంకుస్థాపన


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో కీలక ఘట్టానికి తెర లేచింది. రాజధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో మరికాసేపట్లో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి ఉదయం 8.23 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. తాత్కాలిక సచివాలయం కింద మొత్తం మూడు భవనాలు నిర్మితం కానున్నాయి. వీటిలో రెండింటిని ఎల్ అండ్ టీ నిర్మించనుండగా, మరో దానిని షాపూర్జీ పల్లోంజీ సంస్థ నిర్మించనుంది. ఈ రెండు సంస్థలకు కాంట్రాక్టులు కుదిరిన వెంటనే తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో 45.129 ఎకరాల్లో నిర్మించనున్న ఈ భవన నిర్మాణాలకు ఆయన కొద్దిసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు. నేటి ఉదయం 7 గంటలకు పూజాదికాలు ప్రారంభం కాగా, శంకుస్థాపన కార్యక్రమం మొత్తం 9 గంటల్లోగా పూర్తవుతుంది.

  • Loading...

More Telugu News