: హీరోగా కూల్... అన్నగా మాత్రం హిట్లర్!: అర్జున్ కపూర్ పై సోనమ్ కంప్లైంట్
తన అన్నలు తనను కనిపెట్టుకుని ఉండడానికే వాళ్లకి టైం సరిపోతుందని అనిల్ కపూర్ తనయ సోనమ్ కపూర్ తెలిపింది. 'నీరజ' సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ, తన అన్న హర్షవర్థన్ కపూర్ కు తోడు పెదనాన్న పిల్లలు అర్జున్ కపూర్, మోహిత్ కపూర్ లు నీడలా తనని వెన్నంటి ఉంటారని తెలిపింది. అనుక్షణం తనని కంటికి రెప్పలా కాపాడుతారని చెప్పింది. వారితోనే పార్టీలు చేసుకోవాలని, అలా చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని సోనమ్ చెప్పింది. కనీసం వారి ఫ్రెండ్స్ ను కూడా పరిచయం చేయరని, ఒకవేళ ఎప్పుడైనా చేసినా వాళ్లు కూడా తనని అన్నయ్యల్లానే ట్రీట్ చేస్తారని వాపోయింది. ఇతరుల్ని అస్సలు కలవనివ్వరని తెలిపింది. అర్జున్ కపూర్ సినిమాల్లో చాలా కూల్ గా కనిపిస్తాడని, అన్నయ్యగా మాత్రం ఇంట్లో 'హిట్లర్' లాంటి వాడేనని చెప్పింది.