: మైదానంలో ఘర్షణకు దిగిన పాక్ క్రికెటర్లకు పీసీబీ వార్నింగ్
పాకిస్థాన్ సూపర్ లీగ్ సందర్భంగా మైదానంలో ఘర్షణకు దిగిన వాహబ్ రియాజ్, షెహజాద్ అహ్మద్ లకు పీసీబీ వార్నింగ్ ఇచ్చింది. క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో వాహబ్, షెహజాద్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. క్షణాల్లో తీవ్రరూపం దాల్చిన ఈ వాగ్యుద్ధం ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లింది. దీంతో ఆటగాళ్లు, అంపైర్లు కలుగజేసుకుని సర్దిచెప్పారు. అనంతరం పీసీబీ వారిద్దరికీ వార్నింగ్ ఇచ్చింది. మ్యాచ్ ను ప్రపంచం మొత్తం చూస్తుందని, ఆట పరువు కాపాడాలని హెచ్చరించినట్టు తెలిపింది. తప్పు చేసినందుకు గాను వాహబ్ మ్యాచ్ ఫీజులో 40 శాతం, షెహజాద్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించినట్టు తెలిపింది.