: రేపు ‘మా భూమి’ వెబ్ సైట్ ప్రారంభం


తెలంగాణలో ప్రభుత్వ భూముల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఒక కొత్త వెబ్ సైట్ ను టీ-సర్కార్ రూపొందించింది. ‘మా భూమి’ పేరిట రూపొందించిన వెబ్ సైట్ ను ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ రేపు ప్రారంభించనున్నారు. ఈ వెబ్ సైట్ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని భూములకు సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్ సైట్ ద్వారా సంబంధిత రైతులు లేదా పట్టాదారులు తమ భూమి మార్కెట్ విలువను వెంటనే తెలుసుకోవచ్చు. రెవెన్యూశాఖకు అందుబాటులో ఉన్న భూముల వివరాలన్నీ ఈ పోర్టల్ ద్వారా ప్రజలు తెలుసుకోవచ్చు.

  • Loading...

More Telugu News