: ధావన్ అసలు రూపాన్ని బయటపెట్టిన రోహిత్!
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మైదానంలో దిగిన తరువాత సీరియస్ గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ చేసేటప్పుడు కూడా మీసం మీద చేయివేస్తూ చాలా గంభీరంగా కనిపిస్తాడు. అయితే ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ధావన్ అసలు సంగతిని రోహిత్ శర్మ బయటపెట్టాడు. యాంకర్ అవతారమెత్తిన రోహిత్, ధావన్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. 'ధావన్ డ్రెస్సింగ్ రూంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు. సహ ఆటగాళ్లతో హాస్యమాడుతూ, సరదాగా, తుళ్లుతూ ఉంటాడు. హర్భజన్ సింగ్ తో కలిసి తోటి ఆటగాళ్లను ఆటపట్టిస్తూ ఉంటాడు. ఇలా ఉండడమే తనకి ఇష్టం' అని చెప్పాడు. దానికి స్పందిస్తూ, దేవుడు తనను ఇలా ఆనందంగా ఉండేలా దీవించాడని ధావన్ తెలిపాడు. అందరూ అనుకునేలా తాను సీరియస్ గా ఉండనని ధావన్ చెప్పాడు.