: రాజమహేంద్రవరంలో మార్చి 6న భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నాం: ఎంపీ హరిబాబు


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన ప్రణాళిక, కేంద్ర పథకాలు, రాష్ట్రానికి అందిస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అనంతరం రాష్ట్ర బీజేపీ అధక్షుడు, ఎంపీ హరిబాబు మీడియాతో మాట్లాడుతూ, మార్చి 6న భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ సభకు హాజరవుతారని చెప్పారు. కాగా ఇదే సమావేశంలో తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకంపై కూడా చర్చించారు. ఏపీ అధ్యక్ష రేసులో సోము వీర్రాజు, పురందేశ్వరి ఉండగా, తెలంగాణ అధ్యక్ష రేసులో ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News