: తుపాకీ మిస్ ఫైర్... టీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే డ్రైవర్ మృతి!
హైదరాబాదులోని హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సీహెచ్ మదన్ రెడ్డి గన్ మెన్ తన వద్ద ఉన్న తుపాకినీ పక్కకు పెట్టాడు. ఈ సమయంలో దాన్ని చూస్తానని ఎమ్మెల్యే డ్రైవర్ గా పనిచేస్తున్న అబ్బాస్ తీసుకున్నాడు. ఆ వెంటనే తుపాకీ మిస్ ఫైర్ అవడంతో తీవ్రగాయాలై డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న వెంటనే డీసీపీ కమలాసన్ రెడ్డి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే కావాలనే డ్రైవర్ తుపాకీతో కాల్చుకుని చనిపోయాడని మరో వాదన వినిపిస్తోంది.