: ఖేడ్ ప్రజలు అపురూపమైన మెజారిటీ ఇచ్చారు: కేసీఆర్
మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఆ ప్రాంత ప్రజలు అపురూపమైన మెజారీటీ ఇచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా రోళ్లపాడులో భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ ఈ మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ, అహర్నిశలు శ్రమించి టీఆర్ఎస్ విజయానికి కారణమైన మంత్రి హరీశ్ రావుకు అభినందనలు చెబుతున్నానన్నారు. ఇదే సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఖేడ్ విజయానికి ఎంతో శ్రమించారని పేర్కొన్నారు.