: ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారులు నివసించే ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం: మంత్రి మాణిక్యాల రావు


ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారులు నివసించే ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తామని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఈ ఏడాది 500 దేవాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఒక్కో దేవాలయ నిర్మాణానికి రూ.5 నుంచి 8 లక్షలు ఖర్చు చేస్తామని, ఆ ప్రాంతాల్లో ఉన్నా వారికే అర్చకత్వంలో శిక్షణ ఇస్తామని మంత్రి తెలిపారు. ఇక ధూప, దీప, నైవేద్యం పథకం కింద ఒక్కో దేవాలయానికి నెలకు రూ.5వేలు ఇస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News