: విశాఖలో సిస్కో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం: చంద్రబాబుకు సిస్కో ఛైర్మన్ హామీ
ఇవాళ ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ సిస్కో (కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కంపెనీ) ఛైర్మన్ తో భేటీ అయి చర్చించారు. విశాఖలో సిస్కో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా బాబు కోరారు. ఇందుకు వెంటనే స్పందించిన సిస్కో ఛైర్మన్... తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆనంద్ మహేంద్ర సహా పలువురు పారిశ్రామిక వేత్తలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. తరువాత అక్కడి నుంచి ముంబయి వెళ్లి, అక్కడ జరుగుతున్న మేకిన్ ఇండియా వారోత్సవాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేకంగా ప్రసంగిస్తారు.