: లాభం ఒక్కరోజే, మళ్లీ జారిపోయిన మార్కెట్!
సోమవారం నాడు భారత స్టాక్ మార్కెట్లో నమోదైన లాభాలు తాత్కాలికమేనని తేలిపోయింది. నేటి ఉదయం 9 గంటల సమయంలో ముగింపు కంటే 150 పాయింట్లు అధికంగా మొదలైన సెన్సెక్స్ పయనం ఆపై అరగంట వ్యవధిలోనే 100 పాయింట్లకు పైగా జారిపోయింది. షార్ట్ కవరింగ్ కారణంగానే లాభపడ్డ సూచికలు, తిరిగి అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో నష్టాల్లో సాగుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 102 పాయింట్ల నష్టంతో 23,458 పాయింట్ల వద్ద, నిఫ్టీ సూచిక 36 పాయింట్ల పతనంతో 7,127 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50లో 18 కంపెనీలు లాభాల్లో ఉండగా, మిడ్ కాప్ 1.31 శాతం, స్మాల్ కాప్ 0.66 శాతం నష్టపోయాయి.