: ట్యుటికోరన్ నౌకాశ్రయంలో మళ్లీ బంగారం స్వాధీనం
తమిళనాడులోని ట్యుటికోరన్ నౌకాశ్రయం స్మగ్లర్లకు అడ్డాగా మారింది. ఇటీవలి కాలంలో ఇక్కడ బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్న ఘటనలను మనం చూస్తున్నాం. గతవారంలో కౌలాలంపూర్ కు తరలించబోతున్న 12 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ ఐదు రోజులకే ఇదే నౌకాశ్రయంలో అధికారులు స్మగ్లింగ్ బంగారాన్ని పట్టుకున్నారు. నౌకాశ్రయంలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన పార్సిల్ లో బంగారం ఉన్నట్లు ఓ ఆగంతుకుడు డీఆర్ఐ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆరు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.2 కోట్లు ఉంటుందని చెప్పారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ పార్సిల్ ను ఎవరు, ఎక్కడికి పంపుతున్నారు? అన్న దానిపై ఆరా తీస్తున్నారు.