: హరీశ్ గారూ... కంగ్రాట్స్: ఖేడ్ విజయంపై కేటీఆర్ ట్వీట్స్
మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. 18వ రౌండ్ కే ఆ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డి విజయం ఖరారైపోయింది. అంతేకాక 19వ రౌండ్ ముగిసేసరికే ఆయన 50 వేల పైచిలుకు మెజారిటీ సాధించారు. దీనిపై వేగంగా స్పందించిన టీఆర్ఎస్ యువనేత, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పార్టీ అభ్యర్థి విజయంపై ట్వీట్ చేశారు. తన బావ, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో పాటు మెదక్ జిల్లా పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలుపుతూ ఆయన ట్విట్టర్ లో ప్రత్యేక కామెంట్లను పోస్ట్ చేశారు. 50 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారని ఆయన ఆ పోస్టుల్లో పేర్కొన్నారు.