: విజయం దిశగా దూసుకెళుతున్న టీఆర్ఎస్... 11 వేల ఆధిక్యం దాటిన భూపాల్ రెడ్డి


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ లో ఘన విజయం సాధించిన తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్, మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల్లో విజయం దిశగా దూసుకెళుతోంది. తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో కొద్దిసేపటి క్రితం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తికాగా టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి 11,565 ఓట్ల ఆధిక్యం సాధించారు. ప్రతి రౌండ్ లో స్పష్టమైన ఆధిక్యం సాధిస్తున్న భూపాల్ రెడ్డి విజయం దిశగా పయనిస్తున్నారు. ఐదు రౌండ్లలో భూపాల్ రెడ్డికి 21,664 వేల ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డికి 10,099 ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 4,896 ఓట్లు వచ్చాయి.

  • Loading...

More Telugu News