: పార్నపల్లెకు జగన్, కేఈ, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా... వీరజవాను అంత్యక్రియలకు భారీగా నేతలు


జమ్మూ కాశ్మీర్ లోని సియాచిన్ లో మంచు తుపాను కారణంగా చనిపోయిన అమర జవాను ముస్తాక్ అహ్మద్ భౌతిక కాయం ఎట్టకేలకు నిన్న రాత్రికి ఆయన స్వగ్రామం కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం పార్నపల్లెకు చేరుకుంది. సియాచిన్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాదుకు, అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో పార్నపల్లెకు సమీపంలోని నంద్యాలకు ముస్తాక్ పార్థివ దేహం చేరింది. నంద్యాల నుంచి రోడ్డు మార్గం మీదుగా ఆయన భౌతికకాయాన్ని అధికారులు స్వగ్రామం తరలించారు. నేడు సైనిక లాంఛనాలతో ముస్తాక్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే, విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరై ముస్తాక్ భౌతిక కాయానికి నివాళి అర్పించనున్నారు. ఏపీ కేబినెట్ లోని పలువురు మంత్రులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News