: ప్రతి పక్షనేతలకు ఫోన్ చేసి ఇంటికి ఆహ్వానించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి పక్షనేతలకు ఫోన్ చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిపక్షనేతలను ప్రధాని తన ఇంటికి ఆహ్వానించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కీలకమైన జీఎస్టీ బిల్లు ఆమోదం పొందాల్సి ఉన్న తరుణంలో ప్రతిపక్షాలను దారిలోకి తెచ్చుకోవాలని ప్రధాని భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిపక్షాలను సమావేశాలకు ముందుగా ఇంటికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బిల్లులపై ప్రతిపక్షాల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రధాని వ్యూహాత్మకంగా వెళుతున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఇంటికి రావాలని ఆయన ప్రతిపక్షనేతలను కోరారు. జేఎన్ యూ, హెచ్ సీయూ ఘటనల నేపథ్యంలో ప్రతిపక్షాలు ఘర్షణాత్మక వైఖరి అవలంబించకుండా ఉంచడంలో భాగంగా ఆయన వారిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది.