: అఫ్జల్ గురును 'గారు' అంటూ సంబోధించి, నాలుక్కరచుకున్న కాంగ్రెస్ నేత!
పార్లమెంట్ పై దాడి కేసులో ఉరి తీయబడిన ఉగ్రవాది అఫ్జల్ గురును 'గారు' అని సంబోధించిన కాంగ్రెస్ పార్టీ అధికారి ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా ఆనక నాలుక్కరచుకున్నారు. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సంబోధన చేశారు. అయితే, తాను చేసిన పొరపాటును గ్రహించిన సుర్జేవాలా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా, ఇటువంటి సంబోధనలు చేయడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు. గతంలో ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ను కూడా ‘గారు’ అని కాంగ్రెస్ పార్టీ నేతలు సంభోదించడం.. ఆ తర్వాత విమర్శల పాలవడం తెలిసిందే.