: గ్రాండ్ గా సల్మాన్ చెల్లికి సీమంతం ... పాత స్నేహితురాలితో కలసి విచ్చేసిన సల్లూ భాయ్!


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత ఖాన్ సీమంతం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ సీమంతం వేడుకను ముంబైలోని స్టార్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు వహీదా రెహమాన్, హెలెన్ తదితరులు హాజరుకాగా, అర్పిత స్నేహితులు మహా సందడి చేశారు. ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా దంపతుల కుమారుడు రియాన్; శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాల కుమారుడు వివాన్ కుంద్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా, ఈ వేడుకలో అందర్నీ ఆకర్షించిన ప్రత్యేకత ఏంటంటే... టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మాజీ భార్య సంగీతా బిజ్ లానీతో కలసి సల్మాన్ ఖాన్ హాజరుకావడం! అజారుద్దీన్ తో పెళ్లికి పూర్వం సల్మాన్, సంగీతా బిజ్ లానీ మధ్య మంచి అనుబంధం ఉండేది. అజ్జూభాయ్ తో వివాహానంతరం వీరి బంధానికి బ్రేక్ పడింది. అయితే అజ్జూభాయ్ తో 2010లో సంగీతా బిజ్ లానీ విడాకులు తీసుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ పాత స్నేహితులు కలసి రావడం, సందడి చేయడం బాలీవుడ్ లో ఆసక్తి రేగుతోంది.

  • Loading...

More Telugu News