: బచాఖాన్ వర్శిటీ ప్రొఫెసర్లకు లైసెన్స్డ్ తుపాకీలు...అనుమతినిచ్చిన వీసీ


పాకిస్థాన్ లోని బచాఖాన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు తమ ప్రాణరక్షణ కోసం లైసెన్స్డ్ తుపాకీలను వెంట తెచ్చుకునేందుకు వర్శిటీ వీసీ ఫజ్ ఉర్ రహీమ్ అనుమతినిచ్చారు. బచాఖాన్ విశ్వవిద్యాలయాన్ని ఈరోజు పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, కళాశాల చుట్టూ, పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. కళాశాల ఆవరణలో, తరగతి గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఎటువంటి భయం పెట్టుకోకుండా తరగతులకు హాజరుకావచ్చన్నారు. లైసెన్స్డ్ తుపాకీలతో వచ్చే ప్రొఫెసర్లు వాటిని విద్యార్థుల ముందు ప్రదర్శించకూడదని సూచించారు. కాగా, గత జనవరిలో ఈ యూనివర్శిటీపై ఉగ్రవాదులు దాడి జరిపిన సంఘటనలో సుమారు 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన కారణంగా వర్శిటీని మూసివేశారు. తిరిగి ఈ రోజున పున:ప్రారంభించారు.

  • Loading...

More Telugu News