: టెలికాం శాఖ సరికొత్త నియమం... మొబైల్ లో ఇక మాతృభాష!
బ్రాడ్ బ్యాండ్ సేవలు ఆంగ్లం మాట్లాడగలిగే వారికే పరిమితం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో భారత టెలికాం శాఖ సరికొత్త నియమాన్ని తీసుకురానుంది. తద్వారా బ్రాడ్ బ్యాండ్ సేవలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు దగ్గర చేయనుంది. దాంతో ఇకపై మొబైల్ ఫోన్లు హిందీ, ఇంగ్లీష్ తో పాటు ఏదైనా ఒక ప్రాంతీయ భాషకు సపోర్ట్ చేయనున్నాయి. సుమారు మూడు లేదా నాలుగు నెలల్లోపు ఈ నియమాన్ని ‘టెలికాం’ సంస్థ తీసుకురానున్నట్లు ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నియమాన్ని తీసుకురావడం ద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారులు తమ మాతృభాషలో సమాచారం తెలుసుకోవచ్చని, ఈ-పంచాయతీ లాంటి ప్రభుత్వ సేవలను సులభంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.