: భయంగా ఉంది...అయినా ఈ భయం బాగుంది: సల్మాన్ ఖాన్
'నీరజ' సినిమా ప్రమోషన్ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పెళ్లి చేసుకోకుండా ఉండడం భయంగా ఉందని అన్నాడు. అయితే ఆ భయాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు. 'ప్రేమ్ రతన్ ధన్ పాయో'లో తనతో జతకట్టిన సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన 'నీరజ' సినిమాకు వినూత్నమైన ప్రమోషన్ చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా సినీ నటులు తమలో గూడుకట్టుకున్న వివిధ భయాలను సరదాగా వ్యక్తీకరించారు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ, పెళ్లంటే తనకు చాలాభయమని, అయితే ఈ భయం తమాషాగా ఉందని అభిప్రాయపడ్డాడు. ఇంకొన్ని రోజులు ఈ భయంలోనే బతికేస్తానని సల్లూభాయ్ చమత్కరించాడు. మొత్తానికి సల్మాన్ ఇప్పట్లో పెళ్లి చేసుకోనని అలా ఇండైరెక్ట్ గా చెప్పేశాడు.