: ఖమ్మం, వరంగల్ కూడా టీఆర్ఎస్ వే...ఈవీఎంల ట్యాంపరింగ్ తోనే విజయం!: కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి


త్వరలో ఎన్నికలు జరిగే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లను కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, అంతమాత్రాన ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉన్నట్టు కాదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ తోనే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిందని, అందుబాటులో మరిన్ని ఈవీఎంలు లేకనే వరంగల్, ఖమ్మం ఎన్నికలు జరిపించలేదని ఆయన ఆరోపించారు. అవకతవకలకు పాల్పడే ఆ పార్టీ ఈ రెండు కార్పొరేషన్లలో గెలిచే అవకాశాలున్నాయని జోస్యం చెప్పిన పాల్వాయి, అన్ని ప్రాజెక్టుల్లో కేసీఆర్ సర్కారు డబ్బు దోచుకుంటోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News