: కుర్రాళ్లు నేర్చుకుంటున్నారు...పరుగులు ఎలా రాబట్టాలో తెలియలేదు: శ్రీలంక కెప్టెన్ చండిమాల్


టీట్వంటీ సిరీస్ కోల్పోవడంపై శ్రీలంక కెప్టెన్ దినేష్ చండిమాల్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే తమ జట్టు యువ ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లో పాఠాలు నేర్చుకుంటున్నారని అన్నాడు. క్రీజులో నిలదొక్కుకుని పరుగులు ఎలా రాబట్టాలో యువ ఆటగాళ్లకు తెలియలేదని అభిప్రాయపడ్డాడు. తొలి టీట్వంటీలో చక్కగా రాణించిన రజిత, శనక, చమీరకు మంచి భవిష్యత్ ఉందని చండిమాల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తొలి మ్యాచ్ లో టీమిండియా టాప్ ఆర్డర్ పై ఆధిపత్యం చెలాయించిన యువబౌలర్లను రెండో మ్యాచ్ లో ధావన్ దెబ్బకొట్టాడని, దాంతో వారు లయతప్పారని ఆయన అభిప్రాయపడ్డాడు. మూడో టీట్వంటీలో టీమిండియా బౌలర్ల ధాటికి పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం సిరీస్ ను దూరం చేసిందని చండిమాల్ తెలిపాడు. ఇప్పుడిప్పుడే పాఠాలు నేర్చుకుంటున్న యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి పాఠాలు నేర్పిందని, మలింగ, మాథ్యూస్, దిల్షాన్ (తొలి టీట్వంటీ) దూరం కావడం తమ జట్టును ప్రభావితం చేసిందని చండిమాల్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News