: సుప్రీం ఆదేశాలపై మద్రాస్ హైకోర్టు స్టే!


వివాదాస్పద న్యాయమూర్తి కర్నన్ వ్యవహారం దేశ న్యాయ చరిత్రలో కొత్త సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తోంది. కర్నన్ కు ఏ విధమైన కేసులనూ అప్పగించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించగా, వాటిపై మద్రాస్ హైకోర్టు కొద్దిసేపటి క్రితం స్టే విధించింది. స్వయంగా జస్టిస్ కర్నన్ ఈ స్టే విధించడం గమనార్హం. తాను సుప్రీంకోర్టు ఆదేశాలను వ్యతిరేకించడం లేదని, అయితే, వారి అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా కోరుతున్నానని ఈ సందర్భంగా జస్టిస్ కర్నన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో లిఖితపూర్వక అభిప్రాయాన్ని ఏప్రిల్ 29లోగా పంపాలని సూచించిన ఆయన, అప్పటివరకూ సుప్రీం ఆదేశాలపై స్టే అమలవుతుందన్నారు. తన పరిధిలోని అంశాలపై కల్పించుకోరాదని కూడా సీజేకు ఆయన సలహా ఇచ్చారు. కాగా, ఈ మధ్యాహ్నం కోర్టు హాల్ లో మీడియాతో మాట్లాడేందుకు కర్నన్ ప్రయత్నించగా, కోర్టు పరిపాలనా విభాగం అందుకు అనుమతించలేదు. దీంతో కోర్టు బయటకు వచ్చిన కర్నన్, మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News