: 'స్వచ్ఛ సర్వేక్షణ్'లో విశాఖకు అవార్డులు... మొదటి స్థానంలో మైసూర్


కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు 'స్వచ్ఛ సర్వేక్షణ్' అవార్డులను ఢిల్లీలో ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విశాఖ నగరానికి రెండు అవార్డులు లభించినట్టు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ మొదటి 10 నగరాల్లో ప్రధమ స్థానంలో మైసూరు నిలిచిందని చెప్పారు. తరువాత స్థానాల్లో... చండీగఢ్, తిరుచురాపల్లి, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, విశాఖ, సూరత్, రాజ్ కోట్, గ్యాంగ్ టక్, పింప్రి చంద్వాడ్, గ్రేటర్ ముంబయి నగరాలు ఉన్నాయి. 34వ స్థానంలో హైదరాబాద్, వరంగల్ ఉన్నాయి. అట్టడుగు స్థాయి నగరాల్లో... కల్యాణ్, దొంబివిల్లి, వారణాసి, జంషెడ్ పూర్, ఘజియాబాద్, రాయ్ పూర్, మేరఠ్, పట్నా, ఇటానగర్, అసన్సోల్, ధన్ బాద్ ఉన్నాయి. పరిశుభ్రతను, నగరాల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ఏర్పాటు చేశామని వెంకయ్య చెప్పారు. తొలి విడత స్వచ్ఛ సర్వేక్షణ్ లో 73 నగరాలు, పట్టణాలు పరిగణనలోకి తీసుకున్నామని, పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని నగరాలకు ర్యాంకింగ్ ఇచ్చామని తెలిపారు.2019 నాటికి స్వచ్ఛ భారత్ సాధించాలన్నది ప్రధాని మోదీ ఆశయమని వెంకయ్య పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News