: 36 అంశాల డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చిన రైల్వే మజ్దార్ యూనియన్
దేశ వ్యాప్తంగా మరోసారి సదరన్ రైల్వే మజ్దార్ యూనియన్ (ఎస్ఆర్ఎంయూ) సమ్మె సైరన్ మోగించింది. ఏప్రిల్ 11 నుంచి దేశ వ్యాప్తంగా రైల్వే సమ్మె చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రైల్వే కార్మికులంతా సిద్ధంగా ఉండాలని యూనియన్ పిలుపునిచ్చింది. ఈ సమ్మెకు 45 లక్షల మంది రైల్వే ఉద్యోగులు వెంటనే మద్దతు పలికారు. మొత్తం 36 అంశాల డిమాండ్లతో సమ్మెకు దిగబోతున్నట్టు ఎస్ఆర్ఎంయూ తెలిపింది.