: పళ్లెం, గరిటెలతో... భార్యాభర్తల బంధాన్ని ముడిపెట్టిన బీజేపీ నేత


ఏపీలో బీజేపీ సీనియర్ నేత, చంద్రబాబు కేబినేట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న పైడికొండల మాణిక్యాలరావు నిన్న రాజమహేంద్రవరం వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా కాపులంతా ప్లేట్లపై గరిటెతో కొడుతూ వినూత్న నిరసన చేపట్టారు. కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతాలంతా నాలుగు రోజుల పాటు పళ్లెం, గరిటెల మోతతో మారుమోగాయి. నిన్న రాజమహేంద్రవరం వేదికగా బీజేపీ ఏపీ శాఖ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పైడికొండల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మొగుడు పళ్లెం తిరగేసి కొడితేనే పెళ్లాం వంట చేసి పెడుతుంది. మనం ప్రాధేయపడే స్థాయి నుంచి భయపెట్టే స్థాయికి ఎదగాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలకు ఓ మహిళా నేత అడ్డుచెప్పగా, ‘‘పెళ్లాం గరిటె తిరగేసినా మొగుడు భయపడతాడు’’ అని ఆయన సర్దిచెప్పారు.

  • Loading...

More Telugu News