: భూకంపాలను పసిగట్టే ఆండ్రాయిడ్ 'మై షేక్' యాప్


భూకంపాన్ని ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకునే విధంగా ఆండ్రాయిడ్ నుంచి ఓ కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. 'మై షేక్' పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్ ను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ఓ పరిశోధక బృందం రూపొందించింది. భూకంపాల తీవ్రతలను గుర్తించే సిస్మోమీటర్ పనితీరుకు అనుగుణంగా యాప్ ను రూపొందించామని పరిశోధకులు తెలిపారు. ల్యాబొరేటరీలో యాప్ ను పూర్తిగా పరీక్షించామని, 93 శాతం కచ్చితత్వంతో ఈ అప్లికేషన్ పనిచేస్తుందని హామీ ఇస్తున్నారు. ఆండ్రాయిండ్ 4.1, ఆపైన వెర్షన్ కలిగిన డివైస్ లలో ఈ యాప్ ఇన్ స్టాల్ అవుతుంది. ఆండ్రాయిడ్ డివైస్ లో ఉండే యాక్సలరో మీటర్ సెన్సార్, జీపీఎస్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.

  • Loading...

More Telugu News