: తప్పు పని చేశానన్న మనస్తాపంతో, భార్యతో పాటు జడ్జి ఆత్మహత్యాయత్నం


తన కింద పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగినితో తప్పుగా ప్రవర్తించిన కేసులో సస్పెండయిన తాంజావూరు జిల్లా న్యాయమూర్తి టీఎస్ నందకుమార్ తన భార్యతో పాటుగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 47 సంవత్సరాల నందకుమార్, అతని భార్య రేవతి ఓ లాడ్జిలో రూం తీసుకుని విషం తాగారు. రూములో దిగిన వారు మళ్లీ బయటకు రాకపోవడంతో మారు తాళాలతో తలుపులు తెరిచిన లాడ్జి ఉద్యోగులు అపస్మారక స్థితిలో ఉన్న దంపతులను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరిద్దరినీ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. నందకుమార్ పరిస్థితి మెరుగ్గా ఉండగా, రేవతి కండిషన్ సీరియస్ గా ఉందని తెలిపారు. కాగా, నందకుమార్ పై 15 రోజుల క్రితం ఆరోపణలు రాగా, ప్రాధమిక విచారణ అనంతరం ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆపై తిరుచురాపల్లి వీడరాదని ఆదేశించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఈ చర్యకు పాల్పడ్డట్టు పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News