: రోజా సస్పెన్షన్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ
వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే.రోజా పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరగనుంది. గతేడాది శాసనసభ సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాను ఏడాదిపాటు సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. తరువాత దానిపై ఆమె హైకోర్టుకు వెళ్లారు. తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను కొట్టివేయాలని, స్పీకర్ ఈ విషయంలో తన అధికార పరిధిని దాటి వ్యవహరించారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఓ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో తన బాధ్యతలను తాను నిర్వర్తించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని రోజా కోరారు.