: దేవుడికీ పాన్ కార్డుతో లింకు పెట్టారు!


దేవుడికి పాన్ కార్డుతో లింకు పెట్టిన వింత సంఘటన భోపాల్ లోని శివపురి జిల్లాలోని ఒక బ్యాంకులో జరిగింది. లుక్ వాసా గ్రామంలో మహవీర్ దిగంబర ఆలయం ఉంది. దాని నిర్వాహకుడు బాబూలాల్ జైన్. దేవాలయం పేరిట స్థానిక మధ్యాంచల్ గ్రామీణ బ్యాంక్ లో ఐదేళ్ల క్రితం కొంత సొమ్ముతో ఒక ఖాతాను తెరిచాడు. ఈ క్రమంలో వార్షిక వడ్డీ మొత్తం పదివేల రూపాయలు దాటింది. దీంతో, పాన్ కార్డు తీసుకురావాల్సిందిగా బ్యాంకు అధికారుల నుంచి దేవాలయానికి నోటీసులు వచ్చాయి. బాబూలాల్ తన పేరిట ఉన్న పాన్ కార్డును, ఇతర పత్రాలను తీసుకుని ఆయన బ్యాంక్ కు వెళ్లాడు. అక్కడి అధికారులు చెప్పిన సమాధానం విన్న బాబూలాల్ నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే, ఈ ఖాతా దేవుడి పేరున ఉందని, కాబట్టి ఆయన పేరిట ఉన్న పాన్ కార్డే తీసుకురావాలని చెప్పారు. అలా చేయని పక్షంలో వడ్డీకి టీడీఎస్ కట్ చేయాల్సి వస్తుందని చెప్పడంతో బాబూలాల్ ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటనపై ఆగ్రహించిన జైనులు ఆందోళనకు దిగారు. ఈ విషయమై బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించగా.. బ్యాంకు నిబంధనలు ఆ విధంగా ఉన్నాయని మేనేజర్ చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News