: యాక్సిడెంట్ అనంతరం బౌన్సర్ల బస్సు ఎక్కిన హీరోయిన్ ప్రణీత
నల్గొండ జిల్లా మోతె వద్ద ఈరోజు మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరోయిన్ ప్రణీతకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆమె హైదరాబాద్ బయలుదేరింది. ఆమెకు రక్షణ కల్పించే నిమిత్తం కొంతమంది బౌన్సర్లను హైదరాబాదు నుంచి బస్సులో ఖమ్మం తీసుకువెళ్లారు. అదే బస్సులో ప్రణీత హైదరాబాద్ కు బయలు దేరింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. కాగా, ఒక బైకును తప్పించే ప్రమాదంలో ప్రణీత కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణీతతో పాటు ఆమె తల్లి, మరో ముగ్గురు స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే.