: రామాయణం పరీక్షలో టాపర్ గా ముస్లిం విద్యార్థిని!
రామాయణం పరీక్షలో ముస్లిం విద్యార్థిని టాపర్ గా నిలిచి అందరినీ ఆశ్చర్య పరిచింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరుకు చెందిన ఫాతిమత రాహిలా అనే బాలిక బడగన్నూరు గ్రామంలోని సుళ్య సర్వోదయ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 'భారత సంస్కృతి ప్రతిష్టాన' సంస్థ ఇటీవల రామాయణంపై పరీక్షలు నిర్వహించింది. మొత్తం 35 మంది ఈ పరీక్షలకు హాజరుకాగా, అందులో ఫాతిమత రాహిలా కూడా ఉంది. 93 మార్కులు సాధించిన ఫాతిమత ఈ పరీక్షలో టాపర్ గా నిలిచింది. కాగా, తమ పాఠశాల విద్యార్థిని సాధించిన విజయంపై ప్రధానోపాధ్యాయుడు శివరాం సంతోషం వ్యక్తం చేశారు.