: అండర్ 19 వరల్డ్ కప్... నిదానంగా లక్ష్యంవైపు వెస్టిండీస్!
అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా ఢాకాలో జరుగుతున్న ఫైనల్ పోరులో భారత్ నిర్దేశించిన 146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అందుకునే దిశగా వెస్టిండీస్ జట్టు నిదానంగా పయనిస్తోంది. చేరుకోవాల్సిన టార్గెట్ స్వల్పంగా ఉండటంతో విండీస్ ఆటగాళ్లు ఆచితూచి ఆడుతుండగా, వికెట్లు తీసేందుకు భారత కెప్టెన్ ఇషాన్ కిషన్ తనవద్ద ఉన్న అన్ని అస్త్రాలనూ ప్రయోగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో విండీస్ జట్టు 50 పరుగులను పూర్తి చేసుకుంది. ఓపెనర్లు పోప్ 3, ఇమ్లాచ్ 15 పరుగులకు అవుట్ కాగా, హేత్మయిర్ 17 పరుగులు, కార్టీ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం విండీస్ స్కోరు 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు కాగా, మరో 32 ఓవర్లలో 93 పరుగులు చేస్తే విజయం సాధిస్తారు.