: పోలీస్ స్టేషన్ లోనే ఆత్మహత్యకు పాల్పడ్డ వివాహిత!
తన భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన ఒక వివాహిత పోలీస్ స్టేషన్ లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. భర్త సుదర్శన్ తనను కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ హారిక (25) అనే మహిళ ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంతో సిరిసిల్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో సీఐ కు తన ఆవేదనను చెప్పేందుకని ఆమె వెళ్లింది. సుమారు రెండు గంటలపాటు ఎదురుచూసినప్పటికీ సీఐ రాకపోవడంతో మనస్తాపం చెందిన హారిక పోలీస్ స్టేషన్ లోనే పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. పోలీసు సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.