: ఢిల్లీ వర్సిటీ విద్యార్థులకు ఉగ్రవాదులతో లింకులు... సిట్, ఎన్ఐఏ రంగప్రవేశం!


ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో అఫ్జల్ గురును తలచుకుంటూ కార్యక్రమాలు నిర్వహించి, ఆపై తీవ్ర వివాదానికి కారణమైన విద్యార్థుల్లో కొందరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు విచారణ జరుపుతున్న పోలీసు వర్గాలు పసిగట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసును ప్రత్యేక దర్యాఫ్తు బృందానికి అప్పగించాలని స్థానిక పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు తమకు లభించిన సాక్ష్యాలను ఎన్ఐఏకు అందించినట్టు తెలిసింది. కాగా, ఈ కేసులో నిజానిజాలను పూర్తిగా విచారించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. మరోవైపు ఢిల్లీలో జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్టు బీజేపీ యువజన విభాగం ఏబీవీపీ విడుదల చేసిన వీడియో మార్ఫింగ్ చేసినదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జేఎన్ యూలో జరిగిన ఘటనలపై రాజకీయ దుమారం చెలరేగుతుండగా, కాంగ్రెస్ తదితర విపక్షాలు బీజేపీపై నిప్పులు చెరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News