: హీరోయిన్ ప్రణీత కారు బోల్తా...స్వల్ప గాయాలు!


రోడ్డు ప్రమాదంలో నటి ప్రణీతకు స్వల్ప గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మోతె దగ్గర ఒక బైక్ ను తప్పించబోయిన ఆమె కారు అదుపుతప్పింది. దీంతో కారు బోల్తా కొట్టింది. ఖమ్మంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరై తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. అక్కడే ఉన్న ఏఈఈలు వెంటనే స్పందించి అంబులెన్స్ ను పిలిపించారు. ఈ ప్రమాదంలో ప్రణీత, ఆమె తల్లి, మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ప్రస్తుతం తాము క్షేమంగా ఉన్నామని, తక్షణం స్పందించి అంబులెన్స్ ను పిలిపించిన అధికారులకు కృతఙ్ఞతలు చెబుతున్నానని ప్రణీత ట్వీట్ చేసింది. తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబుతో ‘బ్రహ్మోత్సవం’లోను, ఆదితో ‘చుట్టాలబ్బాయి’ చిత్రంలోను ప్రణీత నటిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News