: శ్రీజ పెళ్లి పనులు మొదలు... స్వయంగా పసుపు కొడుతున్న ఫొటోను అభిమానులతో పంచుకున్న చిరంజీవి


చిరంజీవి కుమార్తె శ్రీజ వివాహ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. 12వ తేదీన తన ఇంట్లో పసుపు కొట్టే కార్యక్రమంతో పెళ్లి పనులు మొదలయ్యాయని చెబుతూ, చిరంజీవి ఓ చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఇందులో శస్త్రచికిత్స జరిగిన కుడి చేతికి ప్యాడ్ ఉండడంతో, ఆయన మరో చేత్తో రోకలి పట్టారు. తన భార్య సురేఖతో కలసి బంధుమిత్రుల ఆనందోత్సాహాల మధ్య పసుపు దంచారు. ఇటీవల చిత్తూరు జిల్లాకు చెందిన వరుడితో శ్రీజ వివాహం నిశ్చయమైందన్న సంగతి తెలిసిందే. ఈ వేసవిలో పెళ్లి జరుగుతుందని సమాచారం.

  • Loading...

More Telugu News