: ఇప్పటికి అధికారం ఉండొచ్చు, కానీ ఎల్లకాలమూ ఉండదుగా?: రేవంత్ రెడ్డి
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండవచ్చుగానీ, ఎల్లకాలమూ ఉండదని టీటీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికష్టాలైనా పడతానే తప్ప, తాను పార్టీని వదిలే సమస్యే లేదని కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు వివేకానంద, రాజేందర్ రెడ్డిలు తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరడం తనకు బాధను కలిగించిందని అన్నారు. కష్టాల్లో ఉన్న సమయంలో స్వార్థ రాజకీయాల కోసం వారు పార్టీని వీడారని విమర్శించారు. స్వార్థపరులు వెళితే, ఫీలవాల్సిన అవసరం లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని, కిందిస్థాయి నేతలు పైకెదిగే అవకాశాలిప్పుడు పుష్కలమని అన్నారు.