: మైనర్ పై ఎమ్మెల్యే అత్యాచారం, కేసు నమోదు, నేడు అరెస్ట్!


బీహార్ లో ప్రజాప్రతినిధులు ఎలాంటి ఘోరాలకు పాల్పడుతారన్నదానికి మరో ఉదాహరణ ఇది. మహా కూటమిలో భాగంగా అధికారాన్ని అనుభవిస్తున్న ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్)కి చెందిన నవాడ నియోజకవర్గ ఎంఎల్ఏ వల్లభ్ యాదవ్ ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు ఆధారాలు లభించడంతో ఆయనపై కేసు పెట్టారు. యాదవ్ ను నేడు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఫిబ్రవరి 6వ తేదీన జరిగినట్టు తెలుస్తోంది. సులేఖా దేవీ అనే మహిళ తనను ఓ గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లిందని, అక్కడ బలవంతంగా తన చేత మద్యం తాగించారని, ఆపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని ఆ బాలిక వెల్లడించింది. ఆపై రూ. 30 వేలు ఇచ్చి ఎవరికీ విషయం చెప్పవద్దని హెచ్చరించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తి ఎమ్మెల్యే యాదవ్ అని, బాలిక వెల్లడించగా, పోలీసులు ఆమెను యాదవ్ ఇంటికి తీసుకెళ్లారు. తనను తీసుకువచ్చింది ఆ ఇంటికేనని బాలిక గుర్తు పట్టింది. కాగా, బీహార్ లో ఎమ్మెల్యేలపై అత్యాచార ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలువురిపై ఇవే తరహా ఆరోపణలు వచ్చాయి.

  • Loading...

More Telugu News