: ప్రేమిస్తే, పెద్దలు ఒప్పుకోకపోయినా ముందడుగేనంటున్న 34 శాతం యువత
జీవితంలో ఎవరినైనా ప్రేమిస్తే పెద్దలు ఒప్పుకోకపోయినా వివాహం చేసుకుంటామని 34 శాతం మంది అబ్బాయిలు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ దినపత్రిక నిర్వహించిన సర్వేలో వెల్లడైన వివరాలివి. ఇక అమ్మాయిల్లో 22 శాతం మంది మాత్రమే పెద్దలు ఒప్పుకోకున్నా ముందడుగు వేస్తామని చెబుతున్నారు. ప్రేమ పెళ్లా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా? అన్న ప్రశ్నకు 58 శాతం యువత పెద్దలు కుదిర్చిన సంబంధాల వైపే మొగ్గు చూపుతామని చెప్పగా, అబ్బాయిల్లో 32 శాతం మంది, అమ్మాయిల్లో 20 శాతం మంది ప్రేమించే పెళ్లి చేసుకుంటామని స్పష్టం చేశారు. తొలి చూపు ప్రేమ కేవలం ఆకర్షణ మాత్రమేనని, దాన్ని ప్రేమ అనే బదులు వ్యామోహం అనవచ్చని అత్యధికులు వెల్లడించగా, ప్రేమ కంటే కెరీర్, ఉన్నతి ముఖ్యమని యువత భావిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. 17 నుంచి 22 ఏళ్ల వయసున్న యువతీ యువకులను సర్వేలో భాగం చేశామని ఆ దినపత్రిక వెల్లడించింది.